జయలలిత పాత్రలో వాణిశ్రీ

Prasad
సినిమా పరిశ్రమలో అనేక విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని అనుకుని జరిగితే మరికొన్ని కాకతాళీయుంగా జరుగుతుంటాయి. వీటిలో ముఖ్యమైనది ఒకరి కోసం అనుకున్న పాత్రలోకి వేరే వారు రావడం. ఇలా దసరా బుల్లోడు సినిమాకు జరిగింది. తెలుగు సినిమాల్లో సరికొత్త ట్రేండ్ సృష్టించిన సినిమా దసరాబుల్లోడు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణీశ్రీ జంటగా నటించారు. అయితే ఇందులో హీరోయిన్ పాత్రకు ముందుగా జయలలితను అనుకున్నారట. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. అయితే సినిమా ప్రారంభం అవుతుంది అనగా ఎంజిఆర్ తో సినిమా ఉన్న కారణంగా ఈ సినిమా చేయలేక పోతున్నట్లు జయలలిత నుంచి కబురు వచ్చింది. దీంతో వాణీశ్రీని హీరోయిన్ గా ఎంపిక చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: